ఐక్యతే బలం కలిసి నిలబడదాం – మోడీ
కాంగ్రెస్ పార్టీపై సీరియస్ కామెంట్స్
ఢిల్లీ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో ప్రసంగించారు. సమాజాన్ని, మనుషులను విభజించడంలో ఆ పార్టీ సక్సెస్ అయ్యిందని, వారికి దేశ అభివృద్ది పట్టదని మండిపడ్డారు. విభజించడం తప్ప కలపడం తెలియదన్నారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ దేశం కోసం, అందరూ బాగుండాలని కోరుకుంటుందని అన్నారు. విభజించు పాలించు అన్నది కాంగ్రెస్ పార్టీ నినాదమని, అందుకే వారిని జనం పక్కన పెట్టారని కామెంట్స్ చేశారు .
ప్రజలు మరోసారి కమలానికి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ వైపు ఉన్నాయని, త్వరలో జరిగే మరాఠా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో జయకేతనం ఎగుర వేయడం ఖాయమని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
ప్రపంచ మార్కెట్ పరంగా చూస్తే భారత్ ఇప్పుడు ఆర్థిక పరంగా మరింత బలోపేతం అవుతోందని, ముందుకు సాగుతోందని, ఇదంతా బీజేపీ సర్కార్ కొలువు తీరడం, కృషి చేయడం వల్లనే జరిగిందని చెప్పారు ప్రధానమంత్రి.