కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం ఖాయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫైర్
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై భగ్గుమన్నారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. మంచితనం అనే ముసుగు ధరించిన అతడిని జనం ఛీ కొట్టడం ఖాయమని జోష్యం చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తప్పు చేయక పోతే ఎందుకు ఈడీ అరెస్ట్ చేసిందో చెప్పాలన్నారు. పదే పదే తాను నిజాయితీపరుడినంటూ గొప్పలు ఎవరైనా చెప్పుకుంటారా అని ప్రశ్నించారు నరేంద్ర మోదీ.
ఇలా చెప్పే వారే మోసాలకు పాల్పడి ఉంటారని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు మరో ఏడు కేసులు సిద్దంగా ఉన్నాయని హెచ్చరించారు. అరవింద్ కేజ్రీవాల్ మరోసారి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఒకవేళ తను నిజాయితీ పరుడైన సీఎం అయితే ఎందుకని సుప్రీంకోర్టు పూర్తిగా తీర్పు ఇవ్వలేదని నిలదీశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.