నా మౌనం చేతకానితనం కాదు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ – గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన జాతీయ మీడియాతో సంభాషించారు. తాను మౌనంగా ఉన్నానని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున తప్పు పడుతున్నాయని పేర్కొన్నారు.
ఒకవేళ మౌనంగా ఉన్నాను కాబట్టి మోడీకి అవగాహన లేమిగా భావించవద్దని సూచించారు. తాను నోరు విప్పిన రోజు ఏడు తరాల పాపాలను బయట పెడతానంటూ ప్రకటించారు. జూన్ 4 తర్వాత వచ్చే ఆరు నెలల్లో భారీ రాజకీయ మార్పు రాబోతోందని జోష్యం చెప్పారు.
మరోసారి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా కొలువు తీరడం ఖాయమని జోష్యం చెప్పారు. దేశం కోసం , భవిష్యత్ కోసం తాను నిరంతరం పాటు పడతానని స్పష్టం చేశారు మోడీ. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. ప్రతిపక్షాలకు తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. తనతో పెట్టుకున్న ఏ ఒక్క నాయకుడు తనతో తూగే స్థాయి లేదన్నారు మోడీ.