బీజేపీని ఏ శక్తి అడ్డుకోలేదు – మోదీ
ఇండియా కూటమికి అంత సీన్ లేదు
జగిత్యాల – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నికల ఫలితాలే నేడు కూడా రిపీట్ అవుతాయని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలోని జగిత్యాల వేదికగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. అశేష జనవాహినిని చూసి తెగ సంతోషానికి లోనయ్యారు మోదీ. ఆయన తెలుగులో ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్బంగా ప్రసంగిస్తూ మోదీ ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు.
భారతీయ జనతా పార్టీని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు ప్రధానమంత్రి. అవినీతి, అక్రమాలలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ధ్వజమెత్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. తాము ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 545 సీట్లకు గాను 400 సీట్లకు పైగానే గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు మోదీ.
అంతకు ముందు సభా వేదికగా ప్రసంగించిన ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు. ముందు నీ పదవిని కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నారు. తాము కాంగ్రెస్ సర్కార్ ను కూల్చమని కానీ కూలి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉందని హెచ్చరించారు.