మోదీ యూఏఈ..ఖతార్ టూర్
ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా ప్రపంచంలో ఎదురైన సవాళ్లను , దేశాల మధ్య అంతరాలను తొలగించేందుకు గాను కీలక పాత్ర పోషించడం గర్వంగా ఉందన్నారు. ఒకప్పుడు ఇండియా అంటే ఒకింత చులకన భావం ఉండేదని కానీ ఇప్పుడు ఆసీన్ లేదన్నారు. కరోనా కష్ట కాలంలో అమెరికా లాంటి దేశాలు ఇబ్బంది పడ్డాయని కానీ భారత్ నిటారుగా నిలబడిందని, దీనికి మనందరి సహకారం వల్లనే ఇది చోటు చేసుకుందని పేర్కొన్నారు మోదీ.
ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా తాను త్వరలోనే యూఏఈ, ఖతార్ దేశాలను పర్యటించ బోతున్నట్లు తెలిపారు. ఆయా దేశాలతో భారత దేశం ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు.
భారతదేశం-యుఎఇ మధ్య బలమైన స్నేహానికి ఇది నిదర్శనం కానుందన్నారు. తాను అధికారంలోకి వచ్చాక యూఏఈ పర్యటన ఇది ఏడవ సారి అని తెలిపారు మోదీ. తన సోదరుడు మొహమ్మద్ బిన్ జాయెద్ ను కలుసుకోవడం మరింత ఆనందాన్ని కలుగ చేస్తోందని చెప్పారు.