ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఢిల్లీ – తమ పనితీరు చూసి ప్రజలు బీజేపీకి అధికారం ఇచ్చారని అన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో భారీ విజయాన్ని కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. ఢిల్లీని కాలుష్య, అవినీతి రహిత నగరంగా మారుస్తామన్నారు. ఆప్ అవినీతి, అక్రమాలకు దేశ రాజధానిని అడ్డాగా మార్చేసిందని ఆరోపించారు. ప్రజలు సుస్థిరత, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకున్నారని అన్నారు.
అరవింద్ కేజ్రీవవాల్ ఇంత కాలం అబద్దాలు చెబుతూ వచ్చారని అన్నారు. అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు నరేంద్ర మోడీ. ఈ గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందని చెప్పారు. అభివృద్ధి, దార్శనికత , నమ్మకం (వికాస్, దార్శనిక విశ్వాస్) కు దక్కిన విజయం అని అన్నారు.
దశాబ్ద కాలం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రశంసించారు మోడీ. ఢిల్లీలోని 70 సీట్లలో దాదాపు 50 సీట్లను గెలుచుకుని, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బిజెపి ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వస్తోందన్నారు. గత రెండు ఎన్నికల్లో 60 సీట్లను గెలుచుకున్న ఆప్ 20 సీట్లతో వెనుకబడి ఉండడం వారి బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోందన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, అవినీతిలో మునిగి పోయింది… వారి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు జైలుకు వెళ్లారు. మద్యం కుంభకోణం, పాఠశాల కుంభకోణం ఢిల్లీ ప్రతిష్టకు అవమానం అన్నారు.