ఏపీలో గాడి తప్పిన పాలన
ధ్వజమెత్తిన ప్రధాని మోదీ
అమరావతి – ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలన గాడి తప్పిందని ధ్వజమెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
అంతకు ముందు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీకి శాలువా కప్పి, శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. ఇదే సమయంలో పవర్ స్టార్ ప్రధాని కాళ్లు మొక్కారు. వద్దని, కాళ్లు మొక్కవద్దంటూ కోరారు.
అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోదీ.
మొదటిసారిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు రాజ్యం ఏలుతున్నాయంటూ ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ రెడ్డి ఆ తర్వాత నవ రత్నాల పేరుతో రాష్ట్రాన్ని ఆగమాగం చేశాడని మండిపడ్డారు మోదీ.
రాష్ట్రం అభివృద్ది కావాలంటే, ప్రత్యేక హోదా రావాలంటే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులను ఆపేసిందని, అభివృద్దికి ఆటంకం కలిగించిందని ధ్వజమెత్తారు ప్రధానమంత్రి.