ఇక డీఎంకే చాప్టర్ క్లోజ్
నిప్పులు చెరిగిన పీఎం మోదీ
తమిళనాడు – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్బంగా బీజేపీ ఆధ్వర్యంలో రోడ్ షో చేపట్టారు. ఊహించని రీతిలో ప్రధాన మంత్రికి అనూహ్యమైన ఆదరణ లభించింది. పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరు వైపులా నిల్చుని జేజేలు పలికారు.
అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ. సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు కాలం చెల్లిందని అన్నారు. ప్రజలు కుటుంబ పాలన పట్ల విముఖతతో ఉన్నారని చెప్పారు. స్టాలిన్ ను ఇంటికి పంపించాలని డిసైడ్ అయ్యారని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు నరేంద్ర మోదీ.
దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా చాటడం ఖాయమని జోష్యం చెప్పారు. కనీసం గతంలో కంటే మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని అన్నారు. తమ అంచనా ప్రకారం 400 సీట్లకు పైగానే కైవసం చేసుకోబోతున్నామని, తమిళనాట కాషాయ జెండా ఎగురుతుందన్నారు నరేంద్ర మోదీ.