NEWSTELANGANA

కాంగ్రెస్..బీఆర్ఎస్ ఒక్క‌టే – మోదీ

Share it with your family & friends

తెలంగాణ‌ను ఏటీఎంగా మార్చుకున్నారు

సంగారెడ్డి – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ ను ఏకి పారేశారు. విజ‌య సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా మంగ‌ళ‌వారం జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కొత్త ఏటీఎంగా మార్చుకుంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మోదీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కేట‌న‌ని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల మ‌ధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం గురించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని అన్నారు.

అందుకే రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి భార‌తీయ జ‌న‌తా పార్టీని గెలిపించాల‌ని ప్ర‌జ‌లు డిసైడ్ అయ్యార‌ని చెప్పారు మోదీ. త‌మ పార్టీకి క‌నీసం 400 సీట్ల‌కు పైగా సీట్లు రాబోతున్నాయ‌ని జోష్యం చెప్పారు పీఎం.

143 కోట్ల మంది మూకుమ్మ‌డిగా సుస్థిరమైన పాల‌న‌, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్నార‌ని అన్నారు. తాము వ‌చ్చాక అవినీతి, అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేశామ‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ.