కాంగ్రెస్ ఖతం బీజేపీ గెలుపు ఖాయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోష్యం
హర్యానా – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను, వాగ్ధానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానా రాష్ట్రంలో పర్యటించారు.
ఈ సందర్భంగా హిసార్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు నరేంద్ర దామోదర దాస్ మోడీ. కాంగ్రెస్ , ఆమ్ ఆద్మీ పార్టీలు పవర్ లోకి వస్తామని కలలు కంటున్నాయని ఆ పార్టీలకు అంత సీన్ లేదంటూ ఎద్దేవా చేశారు.
విచిత్రం ఏమిటంటే ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారని.. ‘బాపు’ కూడా పోటీదారు, ఆయన కొడుకు కూడా అంతే.. ఇద్దరూ కలిసి ఇతరులను తొలగించడంలో నిమగ్నమై ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఇదంతా చూసి హర్యానాలోని జాగరూకులు కాంగ్రెస్‌ని నిర్మూలించడం మొదలు పెట్టారని అన్నారు… దళితులకు, వెనుకబడిన వారికి కాంగ్రెస్ తలుపులు పూర్తిగా మూసుకు పోయాయని ఎద్దేవా చేశారు. .. అందుకే దళితులు తమకు ఓటు వేయరని ఆ పార్టీకి అర్థమై పోయిందన్నారు. హర్యానాలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు పీఎం.