ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ ఫెయిల్
నిప్పులు చెరిగిన ప్రధాన మంత్రి
న్యూఢిల్లీ – సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఏడు విడతల పోలింగ్ కు గాను 6వ విడతల పోలింగ్ పూర్తయింది. న్యూఢిల్లీలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తో పాటు కన్హయ్య కుమార్ ఓటు వేశారు. ఇదిలా ఉండగా ఇవాళ ఓ జాతీయ మీడియా ఛానల్ తో ప్రధాన మంత్రి మోడీ సంభాషించారు.
ప్రధానంగా ప్రతిపక్షాలు దేశంలో ఎన్నో ఉన్నాయని కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం సరైన పాత్ర పోషించడం లేదంటూ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధానంగా గాంధీ కుటుంబాన్ని ఏకి పారేశారు. వారి కారణంగానే దేశం ఇవాళ అన్ని రంగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను వచ్చాక అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చేశానని చెప్పారు. ఇంకా ఈ దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లాలంటే తన నాయకత్వం ఇండియాకు అవసరమని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికలలో 543 లోక్ సభ స్థానాలకు గాను తమ పార్టీకి కనీసం 400 సీట్లకు పైగానే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.