డీఎంకే పాలన బేకార్ – మోదీ
సీఎం స్టాలిన్ పై కామెంట్స్
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రత్యేకంగా దక్షిణాదిన పాగా వేయాలని డిసైడ్ అయ్యారు. ఈమేరకు పావులు కదుపుతున్నారు. ఎలాగైనా సరే మరోసారి ప్రధానమంత్రి కావాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. పలుమార్లు పర్యటించారు.
ఆయన డీఎంకే పార్టీని, ఆ పార్టీ చీఫ్ ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్ పై తీవ్ర స్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని, అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారి పోయిందని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన పాపాన పోలేదన్నారు.
ప్రజలను ఆచరణకు నోచుకోని హామీలతో మోసం చేశారని, కానీ ఇప్పుడు ప్రజలు చైతన్యవంతమయ్యారని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకేకు ఈసారి ప్రజలు చుక్కలు చూపించడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.