ఇండియా కూటమిపై మోదీ ఫైర్
తమిళనాట బీజేపీ జెండా ఖాయం
తమిళనాడు – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై సారథ్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
కాంగ్రెస్, డీఎంకేతో కూడిన ఇండియా కూటమికి అంత సీన్ లేదన్నారు. తమిళ నాట కాషాయ జెండా ఎగరడం ఖాయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత కూటమి ఉద్దేశ పూర్వకంగా హిందూ మతాన్ని కావాలని అవమానిస్తోందని ఆరోపించారు.
తనను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వస్తున్న ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ దేశం గురించి విజన్ లేకుండా మాట్లాడుతూ , విభజన , విద్వేష రాజకీయాలకు తెర లేపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
143 కోట్ల మంది భారతీయులు మూకుమ్మడిగా మరోసారి తనను ప్రధాని చేసేందుకు సిద్దమైనట్లు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.