NEWSNATIONAL

భార‌త కూట‌మికి భంగ‌పాటు త‌ప్ప‌దు

Share it with your family & friends

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

న్యూఢిల్లీ – ప్ర‌తిపక్షాల‌తో కూడిన ఇండియా కూట‌మిపై నిప్పులు చెరిగారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న ప్ర‌ధానంగా రాహుల్ గాంధీని, ఆయ‌న కుటుంబాన్ని ఏకి పారేశారు. ప్రాంతీయ పార్టీల‌న్నీ కుటుంబ పార్టీలేన‌ని, అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా ఉన్నాయ‌ని ఆరోపించారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌లు గంప గుత్త‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ కావాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పారు. ఎందుకంటే ఈ దేశంలో సుస్థిర‌మైన పాల‌న‌ను, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వాన్ని అందిస్తున్న ఏకైక పార్టీ తామేన‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి మోదీ.

ఇవాళ ఆర్థిక రంగంలో భార‌త్ ముందంజ‌లో కొన‌సాగుతోంద‌ని, రాబోయే 2047 నాటికి ప్ర‌పంచంలోనే టాప్ 5 లో ఉంటుంద‌ని, ఆ దిశ‌గా తాను ప్లాన్ చేశాన‌ని చెప్పారు. తాను ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల గురించి ఆలోచించ‌డం లేద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల గురించి ఇప్ప‌టి నుంచి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇక ఇండియా కూట‌మిలో ఏ ఒక్క‌రు స‌రిగా లేరంటూ సెటైర్ వేశారు.