ఇండియా కూటమికి ఓటమి తప్పదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామెంట్
మధ్యప్రదేశ్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలే తమను గట్టెక్కిస్తాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. ఆరు నూరైనా బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. 545 స్థానాలకు గాను కాషాయ కూటమికి కనీసం 400 సీట్లకు పైగానే వస్తాయని అన్నారు ప్రధానమంత్రి.
ఒకప్పుడు భారత్ అంటే ప్రతి ఒక్కరు గేలి చేసే వారని, కానీ తాను ప్రధానమంత్రిగా కొలువు తీరాక సీన్ మారిందన్నారు. పదే పదే గిల్లి కజ్జాలకు దిగే పాకిస్తాన్ , చైనాలకు చుక్కలు చూపిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదులకు ఒకప్పుడు భారత్ అడ్డాగా ఉండేదన్నారు. కానీ ఇవాళ టెర్రరిస్టులు ఇండియా పేరు ఎత్తితే చాలు వణికి పోతున్నారని , సర్జికల్ స్ట్రైక్స్ తో బెంబేలెత్తించామని చెప్పారు.
ఈ దేశంలో వ్యవస్థలన్నింటిని గాడిన పెట్టామని, అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చేశానని ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విద్య, వైద్యం, ఉపాధి, టెక్నాలజీ రంగాలపై భారత్ కీలకమైన పట్టు కలిగి ఉందన్నారు.