రాహుల్ సవాల్ కు మోదీ రెఢీ
తాను సిద్దంగా ఉన్నానని ప్రకటన
ముంబై – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ నిప్పులు చెరిగారు. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. నిరాధారమైన విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఎవరు ఎవరిని మోసం చేశారనేది దేశ ప్రజలకు తెలుసన్నారు ప్రధాన మంత్రి.
విజయ్ సంకల్ప్ యాత్ర సందర్భంగా ముంబైలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఇన్నేళ్ల కాలంలో సుస్థిరమైన పాలనను, సమర్థవంతమైన నాయకత్వంతో కూడిన దానిని అందిస్తున్న ఘనత తమకే దక్కుతుందన్నారు నరేంద్ర మోదీ.
ఇండియా కూటమి వల్ల ఈ దేశానికి నష్టం తప్ప లాభం అన్నది లేదన్నారు. ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తిరుగు లేదన్నారు ప్రధానమంత్రి. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ విసిరిన సవాల్ ను తాను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని సభా వేదిక నుంచి ప్రకటించారు మోదీ.
తాను ఎక్కడికి రమ్మన్నా వస్తానని స్పష్టం చేశారు ప్రధానమంత్రి. తాను నిలిచి పోరాడే వ్యక్తినని , పారి పోయే ప్రధానిని కాదన్నారు.