వంగ భూమిలో బీజేపీ హవా
ఇక టీఎంసీకి చుక్కలే
పశ్చిమ బెంగాల్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రోడ్ షో, ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కోల్ కతా తో పాటు బెంగాల్ రాష్ట్ర మంతంటా బీజేపీ జెండాలు రెప రెప లాడుతున్నాయని ఇక టీఎంసీకి, దీదీకి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ మార్పు అనేది జూన్ 4 తర్వాత దేశ వ్యాప్తంగా తేలి పోనుందన్నారు.
ముచ్చటగా మూడోసారి తాను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తమ పార్టీకి ఈసారి ఎన్నికల్లో గతంలో జరిగిన ఎన్నికల ఫలితాల కంటే ఎక్కువగా వస్తాయని చెప్పారు. కనీసం 400 సీట్ల కంటే రానున్నాయని తాను అంచనా వేస్తున్నట్లు తెలిపారు మోడీ.