వైసీపీ..కాంగ్రెస్ ఒక్కటే – మోదీ
నిప్పులు చెరిగిన ప్రధానమంత్రి
అమరావతి – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ , కాంగ్రెస్ పార్టీ రెండూ ఒక్కటేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా గళం సభలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ ను, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. పేరుకు వేర్వేరు పార్టీలైనప్పటికీ రెండు పార్టీలు దొందు దొందూ అంటూ ఎద్దేవా చేశారు నరేంద్ర మోదీ. ఏపీలో తమ కూటమి తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతోషంగా లేరంటూ మండిపడ్డారు. జనం జగన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు కంకణం కట్టుకున్నారని, ఇక ఇంటి బాట పట్టడం ఖాయమని జోష్యం చెప్పారు నరేంద్ర మోదీ. ఇన్నేళ్ల పాటు సీఎం ఏం చేశారో ప్రజలకు చెప్పాలని అన్నారు.
రాష్ట్రంలో ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ ఇతర పార్టీలతో కలిసి ముందుకు నడుస్తున్నాయని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.