తాజ్ మహల్ పై మోడీ కామెంట్
అదొక్కటే పర్యాటక ప్రదేశం కాదు
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతంగా వినుతికెక్కిన, ఇండియాలో ఉన్న తాజ్ మహల్ గురించి వ్యాఖ్యానించారు.
ఇండియాలో తాజ్ మహల్ ఒక్కటే పర్యాటక ప్రాంతం కాదని ఇంకా అంతకు మించిన పర్యాటక ప్రాంతాలు, స్థలాలు, దర్శనీయ ఆలయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో దేశాన్ని ఏలిన వారు తమ ఓటు బ్యాంకు కోసం కొన్ని ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు నరేంద్ర మోడీ.
అన్ని పర్యాటక ప్రాంతాల మాదిరి గానే తాజ్ మహల్ కూడా ఒకటి అని స్పష్టం చేశారు పీఎం. తాజ్ మహల్ ఒక్క దానిని దర్శించినంత మాత్రాన మీరు భారత దేశాన్ని మొత్తాన్ని చూసినట్టు కాదని ఎద్దేవా చేశారు ప్రధానమంత్రి.
ఈ దేశం ఆధ్యాత్మికతకు, అద్భుతమైన ప్రదేశాలకు నెలవుగా ఉందన్నారు. కాగా తాజాగా పీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపుతోంది.