పాకిస్తాన్ కశ్మీర్ అప్పగించి తీరాల్సిందే
ఢిల్లీ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన హైలెవల్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా వాడి వేడిగా సాగింది. ప్రధానంగా భారత్ , పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుబ్రమణ్యం జై శంకర్ , సీడీఎస్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ , త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.ఈ భేటీ అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిలో మార్పు లేదన్నారు. ఇదే సమయంలో ఇంకొకరి జోక్యం చేసుకోవడాన్ని తాము సహించ బోమంటూ ప్రకటించారు. చైనా, టర్కీ, ఇరాన్, అమెరికాలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు మోదీ. పీఓకేను భారత్ కు అప్పగించడం మినహా పాకిస్తాన్ కు మరో గత్యంతరం లేదన్నారు. పీవోకేను అప్పగించడం, ఉగ్రవాదులను సరెండర్ చేయడంపైనే ప్రధానంగా చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. తమకు అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదని పేర్కొన్నారు.