ప్రధానమంత్రి మోదీ సర్ ప్రైజ్
పార్లమెంట్ సభ్యులతో లంచ్
న్యూఢిల్లీ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నట్టుండి సర్ ప్రైజ్ చేశారు. తన పార్టీకి చెందిన వారే కాకుండా ఇతర పార్టీలకు చెందిన ఎంపీలతో ముఖా ముఖి కావడం సంచలనంగా మారింది. ఈ దేశంలో అత్యంత జనాదరణ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకే ఒక్కరు ప్రధానమంత్రి.
తాజాగా మోదీ సర్ ప్రైజ్ చేశారు. స్వయంగా తానే పార్లమెంట్ లోని క్యాంటీన్ కు వెళ్లారు. అక్కడ ప్రతిపక్ష పార్టీలకు చెందిన లోక్ సభ సభ్యులను లంచ్ చేసేందుకు ఆహ్వానించారు. దీంతో వారంతా విస్మయానికి గురయ్యారు.
వారందరితో కలిసి భోజనం చేశారు నరేంద్ర మోదీ. వారిని ఆప్యాయంగా పలకరించారు. వారికి తానే స్వయంగా వడ్డించి విస్తు పోయేలా చేశారు ప్రధానమంత్రి. ఆయన సరదాగా విష్ చేయడం, ఆహ్వానించడంతో తోటి ఎంపీలు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
శాఖాహార భోజనంలో బియ్యం, దాల్ , ఖిచ్డీ, టిల్ కాల లడ్డూ వంటివి ఇందులో ఉన్నాయి. ఇక నరేంద్ర మోదీతో కలిసి లంచ్ చేసిన వారిలో బీఎస్పీ నుంచి ఎంపీ రితేష్ పాండే, బీజేపీకి చెందిన లడఖ్ ఎంపీ జమ్యాంగ్ నామ్ గ్యాల్, కేంద్ర మంత్రి మురుగన్ , టీడీపీ నుంచి ఎంపీ రామ్ మోహన్ నాయుడు, బీజేడీకి చెందిన సస్మిత్ పాత్ర, మరాఠా ఎంపీ హీనా రవిత్ ఉన్నారు.