అభివృద్ది..సుపరిపాలనకు మరాఠా పట్టం
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కామెంట్
ఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందంచారు. అద్భుత గెలుపును కట్టబెట్టినందుకు మరాఠా రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు.
అభివృద్ది, సుస్థిరమైన సుపరిపాలనకు జనం ఓటేశారని అన్నారు. ఇది చరిత్ర చెప్పిన సత్యమని పేర్కొన్నారు. ఇండియా కూటమి ఇచ్చిన హామీలు వర్కవుట్ కాలేదన్నారు. ప్రజలు తమ ప్రభుత్వం పట్ల పూర్తిగా నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నారని ఈ ఫలితాలు తెలియ చేశాయని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ.
ఈ గెలుపుతో మరింత బాధ్యత పెరిగిందని, మీరు పెట్టుకున్న నమ్మకానికి తగినట్టుగా మెరుగైన పాలనను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని పేర్కొన్నారు.
ప్రత్యేకించి మహారాష్ట్ర లోని నా సోదరీమణులు , సోదరులకు ముఖ్యంగా రాష్ట్ర యువత , మహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు నరేంద్ర దామోదర దాస్ మోడీ. మీరు అందించిన ఈ అపురూపమైన విజయం మరింత బలాన్ని, శక్తిని ఇచ్చిందని స్పష్టం చేశారు.