మోడీకి పుతిన్ గ్రాండ్ వెల్ కమ్
రష్యాకు చేరుకున్న ప్రధానమంత్రి
రష్యా – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అపూర్వమైన రీతిలో స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పీఎం రష్యాకు చేరుకున్నారు. అక్కడ రష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్ సాదర స్వాగతం పలికారు మోడీకి. వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా బంధం బలపడుతూ వస్తోంది. ఇరు దేశాల మధ్య విడదీయలేని స్నేహం కొనసాగుతూ వస్తున్నది.
ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు అమెరికా నానా తంటాలు పడుతుంటే భారత దేశం మాత్రం అటు అమెరికాతో ఇటు రష్యాతో సత్ సంబంధాలను నెరుపుతూ వస్తోంది. తమది తటస్థ విదేశాంగ విధానమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.
తన చిరకాల స్నేహితుడితో కరచాలనం చేయడం, ఆలింగనం చేసుకోవడం మరింత ఆనందాన్ని కలిగించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నోవో ఒగారియోవోలో ప్రధానికి పుతిన్ ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చారు. భారత్, రష్యా మధ్య మైత్రీ బంధం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోడీ.