NEWSNATIONAL

ప్ర‌చారం ఎక్కువ ప‌ని త‌క్కువ

Share it with your family & friends

మోసం చేసేందుకు బీజేపీ రెడీ

న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లో భాగంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని, భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏకి పారేసింది. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే చాలు మోదీ , ఆయ‌న ప‌రివారం పెద్ద ఎత్తున గోబెల్స్ ప్ర‌చారానికి దిగుతుంద‌ని ఆరోపించింది.

ఇదిలా ఉండ‌గా ఈ మ‌ధ్య మోదీ జాతీయ స్థాయిలోని ప్ర‌ధాన చాన‌ళ్ల‌తో పాటు ఆయా రాష్ట్రాల‌లో టాప్ లో ఉన్న ప్ర‌సార మాధ్య‌మాల‌తో ప్ర‌త్యేకంగా సంభాషించారు. విచిత్రం ఏమిటంటే త‌ను చెప్పేది మాత్ర‌మే వినాల‌ని కోరుకుంటున్నారు.

త‌న‌ను నిల‌దీసి, ప్ర‌శ్నించే పాత్రికేయుల‌కు , మీడియా ఎక్స్ ప‌ర్ట్స్ ను దరి దాపుల్లోకి రానీయ‌డం లేదు. విచిత్రం ఏమిటంటే ఇంత కాలం ప్ర‌చారానికే ప్ర‌యారిటీ ఇచ్చారు త‌ప్ప ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించు కోలేదంటూ కాంగ్రెస్ పార్టీ మండిప‌డింది.

విచిత్రం ఏమిటంటే న‌రేంద్ర మోదీ ఇండియా టుడేకు చెందిన ఆరు మంది జ‌ర్న‌లిస్టుల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. కానీ ప్ర‌ధాన జ‌ర్న‌లిస్టు గా ఉన్న రాజ్ దీప్ స‌ర్దేశాయ్ కు మాత్రం ఛాన్స్ ఇవ్వ‌లేదు.

ప్ర‌ధాన‌మంత్రి ఏబీపీ న్యూస్ కి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు..కానీ సందీప్ చౌద‌రిని అనుమ‌తించ లేదు. ర‌వీష్ కుమార్ ఛాన‌ల్ నుండి త‌ప్పుకున్న త‌ర్వాతే మోదీ ఎన్డీటీవికి ఛాన్స్ ఇచ్చారు. మ‌ణిపూర్ , ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ కేసుల‌తో స‌హా న‌రేంద్ర మోడీకి న‌చ్చ‌ని ప్ర‌శ్న‌లు రాజ్ దీప్ , సందీప్ అడిగార‌ని తెలుసు.

ఇక ఎజెండాలోని సిలబస్‌కు వెలుపల ప్రశ్నలు అడగని రాహుల్ కన్వాల్, చిత్ర, అంజనలకు అతను ఇంటర్వ్యూలు ఇవ్వ‌డం విశేషం.