అరుదైన రాజకీయ వేత్త అటల్
ప్రశంసించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ – భారతదేశం గర్వించదగిన రాజకీయ వేత్త అటల్ బిహారి వాజ్ పేయి అని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ . 100వ జయంతి సందర్భంగా స్మరించుకున్నారు. ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ స్మారక చిహ్నం వద్ద ప్రధాని మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ దేశానికి దిశా నిర్దేశం చేయడంలో స్పూర్తి దాయకంగా నిలిచారని ప్రశంసించారు. వాజ్ పేయి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. పాలనా పరంగా చెరగని ముద్ర వేశారన్నారు.
భారతదేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని అన్నారు. 21వ శతాబ్దానికి భారతదేశ పరివర్తనకు రూపశిల్పి అని కొనియాడారు. ఆయన దార్శనికత, లక్ష్యం ఒక సంకల్పానికి బలాన్ని ఇస్తూనే ఉంటుందన్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ. తను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.
వీటి కారణంగా భారత దేశం ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగిన దేశంగా గుర్తించ బడిందన్నారు. కవిగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా, మేధావిగా , నిబద్దత, విలువలతో కూడిన ఆయన జీవితం ఎందరికో స్పూర్తి దాయకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు చంద్రబాబు నాయుడు.