ఆయన జీవితం స్పూర్తి దాయకం
న్యూఢిల్లీ – ఇవాళ ప్రముఖ సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు, మానవత్వానికి ప్రతీకగా నిలిచిన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని జీవితాన్ని సార్థకం చేసుకున్న శ్రీశ్రీశ్రీ శివకుమార స్వామీజీ జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.
శ్రీ శివకుమార్ స్వామీజీ చేసిన సేవలు ఎల్లప్పటికీ నిలిచే ఉంటాయని పేర్కొన్నారు. ఆయన జీవితం , అందించిన సందేశం కోట్లాది మందిని ప్రభావితం చేసిందని కొనియాడారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీ.
నిస్వార్థం మూర్తీ భవించిన మానవత్వంతో కూడిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు . కరుణతో కూడిన నిజమైన స్పూర్తి తనను మరింత ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. సమాజ సేవకు పూర్తి కాలం అంకితం కావడం మామూలు విషయం కాదని అన్నారు.
విద్య, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం దిశగా శ్రీ శివ కుమార స్వామీజీ చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ఆయనను స్మరించు కోవడం తన విధి అని స్పష్టం చేశారు ప్రధానమంత్రి మోదీ. తన జీవితమంతా సేవకే పరిమితం కావడం ఎల్లప్పటికీ సదా స్మరణీయమని తెలిపారు.