NEWSNATIONAL

అడ‌వి బిడ్డ‌ల ఆరాధ్య దైవం బిర్సా ముండా

Share it with your family & friends

ఘ‌నంగా నివాళులు అర్పించిన ప్ర‌ధాని మోడీ

ఢిల్లీ – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ అడ‌వి బిడ్డ‌ల ఆరాధ్య దైవం బిర్సా ముండాకు ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి న‌మ‌స్క‌రించారు. ఈ సంద‌ర్బంగా బిర్సా ముండా చేసిన త్యాగం గురించి స్మ‌రించుకున్నారు.

భార‌త దేశ చ‌రిత్ర‌లో చెర‌ప‌లేని అధ్యాయం బిర్సా ముండా జీవితం అని కొనియాడారు. ఆయ‌న అకుంఠిత దీక్ష‌, జ‌రిపిన పోరాటం ఎప్ప‌టికీ స్పూర్తి దాయ‌కంగా నిలుస్తంద‌న్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన సంకల్పానికి ఆయన జీవితం కొత్త శక్తిని ఇస్తూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాని దామోద‌ర దాస్ మోడీ.

స్వాతంత్ర స‌మ‌ర యోధుడు, గిరిజ‌న వ‌ర్గాల హ‌క్కుల కోసం , వారి ఆత్మ గౌర‌వం కోసం పోరాడిన దార్శ‌నిక‌త క‌లిగిన నాయ‌కుడు బిర్సా ముండా అని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి.

న‌వంబ‌ర్ 15న బిర్సా ముండా 150వ జ‌యంతి. ప్ర‌పంచంలో సూర్య చంద్రులు ఉన్నంత వ‌ర‌కు బిర్సా ముండా బ‌తికే ఉంటార‌ని, అడ‌వి బిడ్డ‌ల హృద‌యాల‌లో నిలిచి ఉంటార‌ని అన్నారు. ఆయ‌నను ఆద‌ర్శంగా తీసుకుని ఎంద‌రో గిరిజ‌నుల న్యాయ ప‌ర‌మైన హ‌క్కుల కోసం పోరాడిన చ‌రిత్ర ఉంద‌ని స్ప‌ష్టం చేశారు .