నరేంద్ర మోడీ అరుదైన రికార్డ్
ట్విట్టర్ లో 10 కోట్ల మంది ఫాలోవర్స్
న్యూఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అరుదైన రికార్డ్ సాధించారు. ప్రపంచంలోనే అత్యధికంగా పాలోవర్స్ ఉన్న పీఎంగా చరిత్ర సృష్టించారు. ఇప్పటికే మోస్ట్ ఫెవరబుల్ లీడర్ గా గుర్తింపు పొందారు. తన జీవితం కాలంలో ఏకంగా భారత దేశ రాజకీయాలలో మూడుసార్లు వరుసగా ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి గతంలో దివంగత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ పేరుతో ఉన్న రికార్డ్ ను సమం చేశారు.
సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్న దేశాధినేతలలో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ అందరికంటే ముందంజలో కొనసాగుతున్నారు. ఇది 143 కోట్ల మంది భారతీయులకు గర్వ కారణమనే చెప్పక తప్పదు. తాజాగా మరో కీలకమైన రికార్డుకు చేరువయ్యారు.
ప్రధానమంత్రి నిత్యం ప్రపంచంతో పోటీ పడుతూ ముందుకు సాగుతుంటారు. తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా పంచుకుంటారు. తనకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. ఇక ట్విట్టర్ లో ఏకంగా ప్రధాని మోడీని 10 కోట్ల మంది ఫాలో అవుతుండడం విశేషం. ఇది కూడా ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు.