పీఎం మోడీ వెరీ వెరీ స్పెషల్
తుపాకుల నీడలో యోగా డే
జమ్మూ కాశ్మీర్ – భారత దేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏది చేసినా అది వార్త అవుతుంది..అంతకు మించి సంచలనంగా మారుతుంది. ప్రచురణ, ప్రసార, డిజిటల్ మాధ్యమాలలో తను వెరీ వెరీ స్పెషల్ .
ఒక రకంగా చెప్పాలంటే శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన యోగా డే కార్యక్రమంలో నరేంద్ర మోడీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన చిన్నారులు, పెద్దలతో కలిసి యోగాను ప్రాక్టీస్ చేశారు. ఆయన చలవ వల్లనే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు అత్యంత జనాదరణ లభించింది అని చెప్పక తప్పదు.
మోడీ ఆశాజనకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన నిత్యం అభివృద్ది మంత్రాన్ని జపిస్తారు. ఈసారి కూడా ప్రధాన మంత్రిగా కొలువు తీరారు. ఇది రికార్డు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో యువతీ యువకులతో కలిసి యోగా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.