చిన్నారితో మోదీ వైరల్
మందకృష్ణ మాదిగ నా సోదరుడు
వరంగల్ జిల్లా – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చనీయాంశంగా మారారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తెలంగాణలోని ఓరుగల్లులో పర్యటించారు. ఈ సందర్బంగా అరుదైన సన్నివేశానికి వేదికైంది ఈ ప్రాంతం.
ప్రచారం కోసం వెళుతుండగా లక్ష్మిపురం గ్రామానికి చేరుకున్న వెంటనే ఓ చిన్నారిని తన ఒడిలోకి తీసుకున్నారు నరేంద్ర మోదీ. చిన్నారిని చూస్తుంటే తనను మరింత సంతోషానికి గురి చేసిందని తెలిపారు. ఇదే విషయాన్ని స్వయంగా ట్విట్టర్ లో పంచుకున్నారు.
ఇదే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్ ) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రధానమంత్రితో భేటీ కావాడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా తనే స్వయంగా పోస్టు చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
మందకృష్ణ మాదిగను తన స్వంత సోదరుడి లాంటి వాడని పేర్కొనడం విశేషం. రెండు సన్నివేశాలు తనను అత్యంత ఆనందానికి గురి చేసేలా చేశాయని స్పష్టం చేశారు.