NEWSNATIONAL

కాజిరంగాలో మోదీ హ‌ల్ చ‌ల్

Share it with your family & friends

ఏనుగుల‌తో ఫోటోలు అదుర్స్

న్యూఢిల్లీ – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఏది చేసినా ఓ సంచ‌ల‌న‌మే. ఆయ‌న నిత్యం ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో ఉంటారు. సోష‌ల్ మీడియాను త‌ను వాడుకున్నంతగా ఇంకెవ‌రూ వాడుకోలేదంటే న‌మ్మ‌లేం. ఓ వైపు ఎన్నిక‌ల హ‌డావుడి ఉన్నా ఏ మాత్రం తొట్రుపాటుకు గురి కాకుండా ముందుకు వెళుతున్నారు. ఈసారి గ‌తంలో కంటే ఎక్కువ సీట్లు త‌ప్ప‌కుండా సాధిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు మోదీ.

ఇదిలా ఉండ‌గా శనివారం ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ప్ర‌ధాన‌మంత్రికి ప్ర‌కృతి అన్నా, జంతుజాలం అన్నా అమిత‌మైన ఆస‌క్తి. ఆయ‌న ఈమ‌ధ్య‌నే ప‌ర్యాట‌క రంగానికి ఊతం ఇచ్చేలా ల‌క్ష ద్వీప్ కు వెళ్లారు. మ‌లేషియా భార‌త్ ప‌ట్ల ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో ఉన్న‌ట్టుండి ఆ దేశానికి ఝ‌ల‌క్ ఇచ్చారు మోదీ.

ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కులలో ఒక‌డిగా గుర్తింపు పొందారు న‌రేంద్ర దామోదార దాస్ మోదీ. తాజాగా ఆయ‌న కాజి రంగాకు వెళ్లారు. అక్క‌డ ల‌ఖిమాయి, ప్ర‌ద్యుమ్న‌, పూల్మాయిల పేర్లోతో ఉన్న ఏనుగుల‌కు చెర‌కు తినిపించారు మోదీ. కాజీ రంగా ఖ‌డ్డ మృగాల‌కు పేరు పొందింది. ఇత‌ర జాతుల‌తో పాటు ఇక్క‌డ ఏనుగులు కూడా ఎక్కువ సంఖ్య‌లో ఉన్న‌ట్లు గుర్తించారు.