NEWSNATIONAL

ప్ర‌ధాని మోడీ వైర‌ల్

Share it with your family & friends

నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

త‌మిళ‌నాడు – ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ వైర‌ల్ గా మారారు. మ‌రోసారి ఆయ‌న చ‌ర్చ‌నీయాంశం కావ‌డం విశేషం. దేశ వ్యాప్తంగా హ‌ల్ చ‌ల్ గా మారిన ప్ర‌ధాని చేసింది ఏమిటంటే త‌ను ధ్యానం చేయ‌డం. ఇది ప్ర‌తి ఒక్క‌రు చేస్తూనే ఉంటారు ఎక్క‌డో ఒక చోట‌. కొంద‌రు శ్వాస మీద ధ్యాస పెడితే మ‌రికొంద‌రు మ‌న‌సు మీద ఫోక‌స్ పెడతారు.

ఇది ప‌క్క‌న పెడితే మోడీ క‌న్యాకుమారిలో కొలువు తీరారు. అక్క‌డ ప్ర‌సిద్ద‌మైన అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు. స‌ముద్రంలో స్నానం చేశారు. ఆ త‌ర్వాత సూర్య న‌మ‌స్కారం పెట్టారు. అక్క‌డి నుంచి భారీ భ‌ద్ర‌త మ‌ధ్య స్వామి వివేకానందుడు న‌డ‌యాడిన స్థ‌లం వ‌ద్ద ధ్యానం ప్రారంభించారు.

గ‌త 10 ఏళ్ల ప్ర‌ధాని కాలంలో ఎక్కువ‌గా ఆల‌యాల‌ను సంద‌ర్శించేందుకే ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ్చారు. విదేశాల‌లో ప‌ర్య‌టించ‌డం, దేశంలో ప‌ర్యాట‌క ప్రాంతాలు, గుళ్లు, గోపురాలు సంద‌ర్శించ‌డం చేశారు. ఓ వైపు దేశం స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల‌తో కొట్టు మిట్టాడుతుంటే తాను మాత్రం మౌనంగా ఉన్నారు.

మొత్తంగా మ‌రోసారి మోడీ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మార‌డం విశేషం. అంతా మోడీనా మ‌జాకా అంటున్నారు.