భారతీయులంతా బాగుండాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
హైదరాబాద్ – దేశంలోని ప్రతి భారతీయుడు బాగుండాలని ఆకాంక్షించారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. తెలంగాణ పర్యటనలో భాగంగా పీఎం సికింద్రాబాద్ లోని ప్రముఖ దేవాలయం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ నరేంద్ర మోదీకి సాదర స్వాగతం పలికింది.
అనంతరం ప్రధాన మంత్రి ఆలయం లోపలకు చేరుకున్నాడు. అక్కడ పూజారులు మోదీని ఆశీర్వదించారు. అంతకు ముందు ప్రధానమంత్రి అమ్మ వారికి పూజలు చేశారు. దేశంలోని భారతీయులంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో బాగుండేలా చూడాలని తాను అమ్మ వారిని కోరుకున్నట్లు చెప్పారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం ప్రధాన మంత్రి మీడియాతో మాట్లాడారు. అత్యంత శక్తివంతమైన ఆలయాలలో ఈ అమ్మ వారు కూడా ఒకరని పేర్కొన్నారు. తాను ఇవాళ దర్శించు కోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.