పీఎం నరేంద్ర మోడీ టూర్
రష్యాలో రెండు రోజుల పాటు
న్యూఢిల్లీ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ రష్యాలో పర్యటించనున్నారు. సోమవారం ఆయన రష్యాకు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రిగా ఆయన తాజాగా దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి రికార్డ్ సృష్టించారు. సుదీర్ఘ కాలం తర్వాత దేశానికి మూడుసార్లు పీఎం కావడం విశేషం.
గతంలో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మూడుసార్లు పీఎంగా పని చేశారు. విశిష్ట సేవలు అందించారు. ఈ దేశానికి సంబంధించి దిశను, దశను మార్చిన ఘనత పండిట్ నెహ్రూకే దక్కుతుంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.
సాంకేతిక పరంగా కీలకమైన మార్పులు రావడంతో డిజిటల్ టెక్నాలజీపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఇదిలా ఉండగా భారత దేశానికి రష్యాకు మధ్య గత కొంత కాలం నుంచి బంధం మరింత బలపడింది. ఈ మేరకు 2 రోజుల పాటు రష్యాలో ఉండనున్నారు మోడీ.