హరిచంద్ జీవితం స్పూర్తి దాయకం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కితాబు
బంగ్లాదేశ్ – శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్ జీ జయంతి సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఆయనకు పూలమాలలు సమర్పించి పూజలు చేశారు. నివాళులు అర్పించారు. ఆయన జీవితం అత్యంత ప్రభావితం చూపుతుందని తెలిపారు మోదీ.
ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదే నిబద్దతను పాటించాలని సూచించారు ప్రధానమంత్రి. తాను కూడా మతు ధర్మ మహా మేళా 2024కు స్వాగతం పలుకుతున్నానని స్పష్టం చేశారు.
మతువా కమ్యూనిటీది గొప్పనైన, అరుదైన సంస్కృతి అని కొనియాడారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఈ గొప్ప సంస్కృతి గురించి తెలుసుకున్నందుకు , గుడిని దర్శించు కున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం వివిధ పథకాలు, చట్టాల ద్వారా సమాజ శ్రేయస్సును కూడా నిర్దారిస్తుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
బంగ్లాదేశ్ లోని ఠాకూర్ నగర్ , ఒరకండి పర్యటనల నుండి సంగ్రహావ లోకనాలను కూడా పంచుకుంటున్నానని, మీరు కూడా తనతో పాటు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.