బ్రిక్స్ సదస్సుపై పీఎం ఫోకస్
రష్యాకు బయలు దేరిన మోడీ
ఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యాకు బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు బ్రిక్స్ సదస్సు జరగనుంది. రష్యాలోని కజాన్ కేంద్రంగా జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు మోడీ. రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా రావాలంటూ ప్రధానమంత్రికి ఆహ్వానం పంపారు. ఈ మేరకు ఆయన కజాన్ కు వెళ్లారు.
ప్రస్తుతం భారత్ , కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటీవలే పాకిస్తాన్ లో జరిగిన కీలక సదస్సుకు మోడీ వెళ్లాల్సి ఉండగా ఆయన తరపున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ హాజరయ్యారు.
ఇక భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా పేరు పొందింది. ఈ తరుణంలో డిజిటలైజేషన్ లో టాప్ లో కొనసాగుతోంది. ఇక సీమాంతర ఉగ్రవాదం పలు దేశాలను ఇబ్బంది పెడుతోంది. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిక్స్ సదస్సుకు హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కీలకమైన ప్రధాన అంశాల గురించి ప్రత్యేకంగా బ్రిక్స్ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే విషయాన్ని ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ.