సీజేఐ నివాసంలో మోడీ పూజలు
దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలు
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ ప్రత్యేకంగా సీజేఐ నివాసానికి వెళ్లారు. నిన్నటి దాకా ఉప్పు నిప్పు లాగా ఉన్నారు సీజేఐ , పీఎం. చాలా సందర్భాలలో నర్మ గర్భంగా విమర్శలు కూడా కూడా చేశారు.
కీలకమైన తీర్పులు వెలువరించి అందరినీ విస్మయ పరిచారు జస్టిస్ ధనంజయ చంద్రచూడ్. కానీ ఉన్నట్టుండి వినాయకుడికి పూజలు చేసే విషయంలో ప్రధానమంత్రిని ఆహ్వానించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
భారత రాజ్యాంగాన్ని సంరక్షించాల్సిన సీజేఐ ఇలా ఎలా వ్యవహరిస్తారంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కొనసాగుతోంది నెట్టింట్లో. ఈ దేశం ఎటు పోతోందో తెలియడం లేదని మరికొందరు మేధావులు వాపోతున్నారు.
న్యాయ వ్యవస్థ బలంగా లేక పోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, సీజేఐ తీరు సరిగా లేదంటూ కామెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా ట్విట్టర్ లో సీజేఐ వైరల్ గా మారడం విశేషం.