ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్
స్పష్టం చేసిన రాజ్ దీప్ సర్దేశాయ్
న్యూఢిల్లీ – దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హవా కొనసాగుతోంది. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అన్నది రాబోతోందని స్పష్టం చేశారు ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్. తన పరిశీలనలో ఇప్పటికే మెజారిటీ మార్క్ వస్తుందని తెలిపారు.
అయితే మోదీ చరిష్మా భారతీయ జనతా పార్టీకి మేలు చేకూర్చేలా చేస్తోందన్నారు. ఇందులో భాగంగా మోదీ ప్రారంభించిన అయోధ్య రామ మందిరం ప్రభావం కూడా ప్రజలపై పని చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు రాజ్ దీప్. ఆయన చెప్పే మాటలకు కాస్తా విలువ ఉంది మీడియా రంగంలో. దశాబ్దాల పాటు పని చేస్తూ వస్తున్నారు. వేలాది మందితో సంభాషించారు.
ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లకు పరిమితం కాక పోవచ్చని అయితే ఆశించిన దాని కంటే ఎక్కువగానే సీట్లు రాబోతున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా రాజ్ దీప్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.