బీజేపీ జోష్ మోడీ ఖుష్
ఎగ్జిట్ పోల్స్ లో పీఎం హవా
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా జరిగిన 17వ విడత లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అత్యధిక సీట్లు రానున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 543 సీట్లకు గాను బీజేపీ సంకీర్ణ సర్కార్ కు 390కి పైగానే వస్తాయని పేర్కొన్నాయి. దీంతో కాషాయ శ్రేణుల్లో సంబురాలు మిన్నంటాయి.
భారత దేశ చరిత్రలో ఒకవేళ బీజేపీ గనుక గెలిస్తే ఓ రికార్డ్ గా మిగిలి పోనుంది. గతంలో మూడు సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్ లాల్ నెహ్రూకు దక్కింది. ఈసారి గనుక మోడీ గెలిస్తే తను కూడా మూడోసారి పీఎంగా కొలువు తీరనున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై స్పందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఓటేసిన మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో అంతులేని ఆనందానికి లోనయ్యారు ప్రధానమంత్రి. 143 కోట్ల మంది భారతీయులు ప్రతిపక్షాలను నమ్మ లేదన్నారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అర్థమై పోయందన్నారు. 2047 వరకు తానే పీఎంగా ఉంటానని స్పష్టం చేశారు మోడీ.