సంచలన కామెంట్స్ చేసిన మోదీ
ఢిల్లీ – రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎన్డీయే తప్పకుండా విజయం సాధించి తీరుతుందన్నారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఏ ఎన్నికలైనా సరే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామంటూ ప్రకటించారు. అన్ని ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఒక శక్తిగా అవతరించడం ఖాయమని జోష్యం చెప్పారు. అది బీహార్ అయినా లేక పశ్చిమ బెంగాల్ అయినా తమకు ఎదురే లేదన్నారు. దీంతో పీఎం చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపాయి.
కాగా అంతకు ముందు ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాని మోడీ. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో పాటు ఎన్డీయే మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు. పర్వేశ్ వర్మ , కపిల్ శఱ్మ, కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమం రాం లీలా మైదానంలో జరిగింది. కాగా సీఎం పదవిని అధీష్టించిన రెండవ మహిళగా నిలిచారు.
గుప్తా బిజెపికి నాల్గవ ఢిల్లీ ముఖ్యమంత్రి . ఆ పదవిని నిర్వహించిన రెండవ మహిళా నాయకురాలు. ఆమె ఢిల్లీకి నాల్గవ మహిళా ముఖ్యమంత్రి కూడా, బిజెపి నుంచి గతంలో దివంగత సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్, ఆప్ నుంచి అతిషి తర్వాత తను ఇప్పుడు కొలువు తీరారు.