కువైట్ లో పీఎంకు ఘన స్వాగతం
43 ఏళ్ల తర్వాత తొలిసారి మోడీ పర్యటన
కువైట్ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. అరబ్ దేశం కువైట్ ను సందర్శించారు. ఈ సందర్బంగా సంతోషానికి లోనయ్యారు పీఎంకు. రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఆ దేశ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు.
ఇదిలా ఉండగా కువైట్ కు భారత దేశ ప్రధానమంత్రి వెళ్లడం 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. 1981లో దివంగత పీఎం ఇందిరా గాంధీ పర్యటించారు. భారతదేశం, కువైట్ మధ్య సత్ సంబంధాలు కొనసాగించేందుకు తాము ప్రయత్నం చేస్తామని ప్రకటించారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.
తనను ప్రత్యేకంగా ఇక్కడికి రావాలని ఆహ్వానించడం పట్ల దేశ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ బిల్ జుబేర్ అల్ సబహ్ కు ధన్యవాదాలు తెలిపారు. భారత దేశం ఎల్లప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా శాంతి కలిగి ఉండేలా ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ సందర్బంగా పీఎం.