భారత్ తో పోర్చుగల్ కీలక ఒప్పందం
ప్రధాని మోడీతో మిస్టర్ లూయిస్ భేటీ
బ్రెజిల్ – బ్రెజిల్ లోని రియో డి జెనీరో వేదికగా జరుగుతున్న జి20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయన ఇప్పటికే ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ, సౌత్ కొరియా, బ్రిటన్ దేశాధి ప్రముఖులతో ములాఖత్ అయ్యారు. మోడీ వెంట విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ కూడా ఉన్నారు.
మరో వైపు మంగళవారం పీఎం మోడీ పోర్చుగల్ ప్రధాన మంత్రి మిస్టర్ లూయిస్ మోంటెనెగ్రోతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశం పోర్చుగల్‌తో తన దీర్ఘకాల సంబంధాలకు విలువనిస్తుందని స్పష్టం చేశారు.
తమ సంభాషణ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే సామర్థ్యాన్ని ప్రస్తావించిందని పేర్కొన్నారు మోడీ. పునరుత్పాదక శక్తి , గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలలో సహకారం కోసం అనేక అవకాశాలను సూచిస్తాయని తెలిపారు. ఇంకా అనేక ఇతర అంశాలతో పాటు ప్రధానంగా రక్షణ, జనాభా సంబంధాల గురించి కూడా చర్చించడం జరిగిందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
ఈ విషయాన్ని ప్రత్యేకంగా వెల్లడించారు డాక్టర్ సుబ్రమణ్యం జై శంకర్. ఇదే సదస్సులో చైనా విదేశాంగ శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపాయి. ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.