సంస్కృతి..ఆధ్యాత్మికత దేశానికి అవసరం
దేశ ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోడీ
ఢిల్లీ – ఏ దేశానికైనా సంస్కృతి, నాగరికత, ఆధ్యాత్మికత అనేది ముఖ్యమని పేర్కొన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోర దాస్ మోడీ. ఆయన భారతక్య అనే పేరుతో తన జీవిత చరిత్రను రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రచయితను అభినందించారు. ప్రజలకు ఉపయోగపడేలా రచనలు ఉండాలని సూచించారు. సమాజం పురోభివృద్దికి సలహాలు, సూచనలతో కూడిన అనుభవాలను పుస్తకాలుగా రాస్తే ఎంతో మేలు చేసిన వారవుతారని పేర్కొన్నారు దేశ ప్రధానమంత్రి మోడీ.
ఈ సందర్బంగా రచయిత స్వరాదీష్ సంతోషం వ్యక్తం చేశారు. భారత దేశం గర్వించ దగిన నాయకులలో నరేంద్ర మోడీ ఒకరని, అందుకే ఆయన జీవిత చరిత్ర ఎందరికో స్పూర్తి దాయకంగా ఉంటుందని తాను ఈ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు.
ఈ దేశం మోడీ ప్రధానికాక ముందు అస్తవ్యస్తంగా ఉండేదని, కానీ మోడీ ప్రధానిగా కొలువు తీరాక సీన్ మారిందన్నారు. ఇవాళ భారత దేశం వైపు ప్రపంచం చూసేలా చేసిన ఘనత పీఎంకు దక్కుతుందన్నారు. ఈ దేశాన్ని కొత్త శిఖరాలకు నడిపించే సత్తా, శక్తి కలిగి ఉన్న ఏకైక నాయకుడు ప్రధాని మాత్రమేనని పేర్కొన్నారు స్వరాధీష్. మోడీ లాంటి దమ్మున్న లీడర్ ఉన్నంత వరకు మన దేశాన్ని ఏ ఒక్క దేశం టచ్ చేయలేదని స్పష్టం చేశారు స్వరాధీష్.
మోడీ నాయకుడిగా మరింత బలపడేందుకు, ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవాన్ దత్తాత్రేయను కోరుకుంటున్నట్లు రచయిత తెలిపారు.