భారత దేశం గొప్ప పారిశ్రామికవేత్తను కోల్పోయింది
ఢిల్లీ – ఇవాళ భారత దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గురువారం ఎక్స్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. దేశ ఆర్థిక రంగానికి చోదక శక్తిగా నిలిచిన , వ్యాపారానికి విలువలు నేర్పిన గొప్ప పారిశ్రామిక వేత్త టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా కన్ను మూయడం పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. ఆయనతో తనకు సన్నిహిత సంబంధం ఉందని గుర్తు చేశారు నరేంద్ర మోడీ.
రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార నాయకుడు. అంతే కాదు దయగల ఆత్మ కలిగి ఉన్నారు. అసాధారణమైన మానవుడు కూడా. భారతదేశంలోని పురాతన , అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థల్లో ఒకదానికి స్థిరమైన నాయకత్వాన్ని అందించాడు.
అదే సమయంలో, అతని సహకారం బోర్డ్‌రూమ్‌కు మించినది. అతను ప్రియమైన వ్యక్తి. వినయం, దయమన సమాజాన్ని మరింత మెరుగు పరచాలనే అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలిచారని కొనియాడారు. రతన్ టాటా లేని లోటు తనకే కాదు యావత్ భారత దేశానికి, 143 కోట్ల బారతీయులకు తీరని నష్టంగా పేర్కొన్నారు ప్రధానమంత్రి. సూర్య చంద్రులు ఉన్నంత కాలం రతన్ టాటా ఉంటారని స్పష్టం చేశారు.