సర్జికల్ స్ట్రైక్ లో ఉగ్రవాదులు ఖతం – నెతన్యాహూ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి షాకింగ్ కామెంట్స్
ఇజ్రాయెల్ – దేశ ప్రధాన మంత్రి నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. తమ సర్జికల్ స్ట్రైక్ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము మధ్య ప్రాచ్యాన్ని మార్చబోతున్నట్లు పేర్కొన్నారు.
ఇజ్రాయెలీ సర్జికల్ స్ట్రైక్‌లో పలువురు అగ్రశ్రేణి హిజ్బుల్లా కమాండర్లు మరణించారని ప్రకటించారు. గత కొంత కాలంగా తమ దేశాన్ని, ప్రజలను, ఆస్తులను టార్గెట్ చేస్తూ వచ్చారని, ఇక వారి పని ఖతం చేయడం జరిగిందన్నారు నెతన్యాహూ.
పేజర్ విస్ఫోటనం నుండి గత రెండు రోజుల్లో 879 హిజ్బుల్లా ఉగ్రవాదులు మరణించారని ప్రకటించారు దేశ ప్రధానమంత్రి. 291 మంది సీనియర్ కమాండర్లు ప్రాణాలు కోల్పోగా 509 మంది కంటి చూపును శాశ్వతంగా కోల్పోవడం జరిగిందని చెప్పారు. దాదాపు 1,735 మందికి పైగా తీవ్రవాదులు గాయపడ్డారని అన్నారు నెతన్యాహూ.
ఇజ్రాయెల్ సర్జికల్ స్ట్రైక్‌లో అగ్రశ్రేణి హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం అకిల్ మరణించాడని చెప్పేందుకు సంతోషంగా ఉందన్నాడు ప్రధానమంత్రి. తమ దేశం గురించి ఎవరు ఆలోచించినా లేదా దాడులకు పాల్పడాలని ప్లాన్ చేసినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహూ.