జానీ మాస్టర్ కోసం పోలీసుల గాలింపు
జల్లెడ పడుతున్న నాలుగు బృందాలు
హైదరాబాద్ – రోజు రోజుకు టాలీవుడ్ కు చెందిన కొరియో గ్రాఫర్, జనసేన పార్టీ నేత జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా కేసు రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. తనను మానసికంగా, శారీరకంగా, లైంగిక పరంగా వేధింపులకు గురి చేశాడంటూ తన వద్ద పని చేస్తున్న మరో లేడీ కొరియో గ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది.
ముంబైలో సినిమా పాటకు సంబంధించి ఓ హోటల్ లో దిగిన తనపై బలత్కారం చేయబోయాడని , అంతే కాకుండా తనను చూస్తూ ప్యాంట్ జిప్ కూడా విప్పాడని వాపోయింది. ఇదే సమయంలో తనను ముస్లిం మతంలోకి మారాలంటూ వేధించాడని, వినక పోవడంతో తన భార్యతో కలిసి తనను చిత్రహింసలకు గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు.
ఇదిలా ఉండగా బుధవారం జానీ మాస్టర్ కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. జానీ మాస్టర్ పై పోక్సో కింద కేసు నమోదు చేశామన్నారు.
మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో తనపై అత్యాచారం చేశారని లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు పైన ఈ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ ఇంకా దొరకడం లేదని, పరారీలో ఉన్నాడని తెలిపారు. ఆయనను పట్టుకునేందుకు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు.