జానీ మాస్టర్ పై పోక్సో కింద కేసు నమోదు
మనోడు పవన్ కళ్యాణ్ పార్టీలో సభ్యుడు
హైదరాబాద్ – తెలుగు సినీ రంగంలో సంచలనం కలిగించిన కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచారం, పోక్సో కింద కేసు నమోదైంది. ఆయన బుట్ట బొమ్మ, అరబిక్ కుతు లాంటి పాపులర్ పాటలకు కొరియోగ్రఫీ చేశాడు.
టాలీవుడ్ లో కొరియో గ్రాఫర్ గా పని చేస్తున్న ఓ యువతి జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేశారు. తాను మైనర్ గా ఉన్న సమయంలోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ జానీ మాస్టర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. చివరకు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని వాపోయింది. గత్యంతరం లేక ఫిర్యాదు చేశానని, తనను చంపేస్తాడేమోనన్న భయంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది బాధితురాలు.
దీంతో సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. జానీ మాస్టర్ ను వెతికే పనిలో పడ్డారు. మనోడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో సభ్యుడు. ఆయనకు వీరాభిమాని. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో సైతం డ్యాన్సు కూడా చేశాడు. ప్రచారం చేపట్టాడు. జానీ మాస్టర్ పూర్తి పేరు షేక్ జానీ. జానీ మాస్టర్ గా మారాడు.
ధనుష్ నటించిన తిరుచిత్రంబళంలోని మేఘం కారుకాత పాటకు జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జాతీయ పురస్కారం లభించింది.