మాజీ ఎమ్మెల్యే మర్రిపై కేసు నమోదు
ప్రోటోకాల్ రగడపై ఎమ్మెల్యే ఫిర్యాదు
నాగర్ కర్నూల్ జిల్లా – రాష్ట్రంలో కొత్త సర్కార్ వచ్చినా సీన్ మారడం లేదు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఉన్నతాధికారులు ఇంకా మారక పోవడం విచిత్రంగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రోటోకాల్ రగడ చిలికి చిలికి గాలి వానగా మారింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు చివరకు డీఇవో గోవిందరాజులుపై దాడి చేసేంత దాకా వెళ్లింది.
ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా తాను లేకుండా ఎలా పాఠశాలను ప్రారంభిస్తారంటూ నిలదీశారు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి. ఈ విషయంపై తనకు క్లారిటీ ఇవ్వాలంటూ డీఇవోపై మండిపడ్డారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే అనుచరులు డీఇవో పై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. తన తప్పేం లేదంటూ వాపోయారు. చివరకు పోలీసుల నుంచి రక్షణ కోరడంతో వారి సహకారంతో బతికి బయట పడ్డారు గోవింద రాజులు.
అయితే బడి ప్రారంభోత్సవం కోసం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పేరుతో ఒకటి, మాజీ ఎమ్మెల్యే మర్రి పేరుతో మరో శిలా ఫలకం తయారు చేయించారు.