నటి సౌమ్య జానుపై కేసు
హోం గార్డుపై దాడి చేసింది
హైదరాబాద్ – ఈమధ్య సినిమా రంగానికి చెందిన వారు నిత్యం వార్తల్లో ఉంటున్నారు. తాజాగా రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఏకంగా ప్రముఖ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన మాత్రం తనకేమీ తెలియదని బుకాయించడం విశేషం.
ఇది పక్కన పెడితే బంజారా హిల్స్ లో ట్రాఫిక్ హోం గార్డుపై ఇటీవల ఓ మహిళ దాడి చేసింది. ఇది సంచలనంగా మారింది. జాగ్వార్ కారు నడిపింది . రాష్ గా డ్రైవ్ చేయడమే కాకుండా పైగా బూతులు మాట్లాడం, దూషించడం చేసింది.
ఈ మొత్తం వ్యవహారంపై నగర సీపీ సీరియస్ అయ్యారు. వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఖాకీలు అసలు దాడికి పాల్పడింది సినీ నటి సౌమ్యా జానుగా గుర్తించారు. ఆమెపై కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు.
రాంగ్ రూట్ లో రావడమే కాకుండా హోం గార్డును దూషించింది, ఆపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. అర్జెంట్ పని ఉండడంతో రాంగ్ రూట్ లో వెళితే తప్పేముందంటూ ఓ మీడియా ఛానల్ లో తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ.
అంతే కాదు తానే హోం గార్డుపై కేసు పెడతానంటూ కామెంట్స్ చేసింది.