బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు
కేటీఆర్ తో పాటు ఇతరులపై కూడా
హైదరాబాద్ – బీఆర్ఎస్ నేతలకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ లోని చార్మినార్ వరకు . ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు.
గతంలో బీఆర్ఎస్ పాలన సందర్బంగా తయారు చేసిన రాజ ముద్ర లో మార్పులు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. కాకతీయుల కళాతోరణంతో పాటు చార్మినార్ లోగో నుంచి తొలగించడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్.
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రజా పాలన పేరుతో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందంటూ మండిపడ్డారు. దీంతో కేటీఆర్ తో పాటు పొన్నాల లక్ష్మయ్య, పద్మారావు గౌడ్ , మాగంటి గోపినాథ్ తో పాటు ఇతర సీనియర్ నాయకులపై కేసు నమోదు చేశారు.